Friday, June 17, 2022

భా. ర. సా. పై ఎవరికి భరోసా?

తెలంగాణ రాష్ట్రంలో పలు సమస్యలు ఉన్నా, ముఖ్యమంత్రి గారు మాత్రం ఇవేవీ పట్టనట్టు గా తన లోకం లో మునిగి తేలుతున్నారు. భారత రాష్ట్ర సమితి (భా.రా. సా) పేరు తో జాతీయ పార్టీ పెడుతున్నట్టు, ఢిల్లీ కి వెళ్ళి చక్రం తిప్పుతారు అన్నట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. గంటల తరబడి ముఖ్య నేతల తో చర్చలు జరుపుతున్నారు అని, మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు అని కూడా మనకి చెప్పడం జరిగింది. 

ఇంతకీ ఇలా కొత్త పార్టీ పెట్టాలి అని ఎందుకు అనిపిస్తుంది? 2018 లో భారీ మెజారిటీ తో ఎన్నికలు గెలిచిన తరువాత, ముఖ్యమంత్రి గారి ఆనందానికి, ఆశాలకి హద్దులు లేకుండా పోయాయి. రెండు జాతీయ పార్టీలు దేశానికి చేసింది ఏమి లేవు, ఇప్పుడు తాను వచ్చి దేశాన్ని బాగుచేస్తాను అని చెప్పడం జరిగింది. 2019 ఎన్నికల్లో సొంత రాష్ట్రంలో 9 స్థానాలు మాత్రమే గెలవడం తో, ఈ ఆలోచన కొంచం వెన్నకి పెట్టడం జరిగింది.

2022 లో రాష్ట్రం లో భారతీయ జనతా పార్టీ గణనీయంగా పుంజుకోవడం తో, కెసిఆర్ గారు మళ్లీ తన జాతీయ పార్టీ కలలు మీద కసరత్తు మొదలుపెట్టారు. ఢిల్లీ కి 4 రోజులు వెళ్ళి, కేవలం 4 మీటింగ్స్ పెట్టుకొని వెనక్కి వచ్చారు. బెంగళూరు వెళ్ళి దేవే గౌడ గారి కుటుంబాన్ని కలిసి, ఆ తరువాత పత్రికా విలేకరులు తో మాట్లాడుతూ దేశం త్వరలోనే సంచలన వార్తలు వింటది అని సెలవు ఇచ్చారు. 

రాజకీయాలకు దూరంగా గ ఉండవల్లి అరుణ్ కుమార్ నీ పిలిపించుకుని 3 గంటలు ఆయనతో చర్చలు పెట్టారు. ఒక్కప్పుడు "సన్నాసి" అని తిట్టి, ఇప్పుడు పార్టీ పెట్టడం పై సలహాలు తీసుకున్నారు! 

అయితే ఇప్పుడు అందరి మదిలో మెలిగే ప్రశ్న ఏమిటి అంటే, ఈ భారాసా పార్టి మీద ఎంత మందికి భరోసా ఉంటది? కేసిఆర్ గారు ఏమి 2001 లో తాను తెరాస పెట్టినప్పుడు కూడా ఇలాగే అన్నారు, కాబట్టి నేనూ ఇవి ఏమి పట్టించుకోను అంటున్నారు. ఒక ఉద్యమం చేస్తునప్పుడు చాలా ఏళ్లు శ్రమ పడాలి అని చెప్తున్నారు. తెలంగాణ లో చేసే పనులన్నీ ఇప్పుడు దేశం లో కూడా చేస్తున్నారు అని చెప్తున్నారు. 

కాగా ఇలా చెప్పే పర్వంలో కేసిఆర్ గారు ఏదో ఏదో మాట్లాడుతున్నారు. రైళ్లు వేగంగా పరిగెట్టాలి అంటే భారత రాజ్యాంగం మార్చాలి అని; కేంద్ర ప్రభుత్వం అసలు ఊర్లల్లో రోడ్లు వెయ్యకూడదు అని; అసలు కేంద్ర ప్రభుత్వం ప్రజలకి డబ్బులే వెయ్యకూడదు అని; ఇలా ఏదో ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ కూడా తెరాసా కి మద్దతు గా నిలుస్తుంది అని చెప్పనే లేదు. 

కేసిఆర్ గారు ఎప్పుడు ఏమీ మాట్లాడతారో తెలీని పరిస్థితి. సొంత రాష్ట్రంలో గెలుస్తారో లేదో తెలియని పరిస్థితి. మరి భారాస మీద ఎవరికి ఉంటుంది భరోసా? 

0 comments:

Post a Comment