వైఎసార్ చనిపోయి నాలుగు నెలలు అయినా సరే, ఇంక ఆ మరణం వెనక ఉన్న నిజం బయటికి రాలేదు. ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుంది ? - ఒక వేల టీవీ 5 ఈ ప్రశ్న తో కనక చర్చా కార్యక్రమం నిర్వహించి ఉంటె, అసలు రాష్ట్రం లోనే కాదు, ప్రపంచం లో కూడా (రష్యా తో సహా!) ఎవరికీ కించిత్తు అభ్యంతరం ఉండేది కాదు. కాని టీవీ 5 ఏమి చేసింది అండి. ఎక్కడో రష్యా లో ఉన్న ఒక అనామికుడు వాడు నడిపించే వెబ్సైట్ మీద, అమెరికా లో విచ్చలవిడిగా ఒక ఉహాజనితమైన కుట్ర కధనాన్ని ప్రచురించాడు అంట, వాడు ప్రచురించిన నాలుగు నెలలకి టీవీ 5 మనకి చదివి వినిపించింది. చదివి వినపించడమే కాకుండా, అదేదో అందులో గట్టి నిజం ఉన్నట్టు, దాని మీద ఒక మూడు ఘంటలు చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ "కుట్ర" ప్రకారం రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ గారు మన ముఖ్యమంత్రి ని చంపారు అంట. వినడానికే ఇంత ఎబ్బెట్టు గా ఉన్న ఈ "కుట్ర" ని తీసుకుని, మూడు ఘంటల చర్చా పెట్టడం ఎంత వరకు సమంజసం? కాంగ్రెస్స్ రౌడీలు ఎందుకు ఆగుతారు అండి ? విచ్చలవిడి గా వెళ్లి రిలయన్స్ షాప్లు మీద దాడి చేసారు. విధ్వంసం సృష్టించారు.
వైఎస్ మీద వార్త అంటే, సాక్షి టీవీ ఎందుకు ఆగుతుంది అండి ... కుట్ర కుట్ర అని మళ్ళి మొదలుపెట్టింది. అదే వెబ్సైట్ మీద వార్త సాక్షి కూడా చెప్పడం మొదలు పెట్టింది. రాష్ట్రం లో జరుగుతున్న విధ్వంసం ని చూపించడం మొదలు పెట్టింది. తరువాత ఎన్ టీవీ కూడా మొదలు పెట్టింది. రష్యా వాడు నడిపే వెబ్సైట్ చుసిన ఎవరికైనా అదీ ఎంత చండాలమైన సైట్ ఊ అర్ధం అవుతుంది. రాసిన వాడే, నేను కేవలం ఇలాంటి కుట్ర ఉండి అని భావిస్తున్నా ఆనాడు. జరుగుతున్న తతాగం చూసి రాసిన వాడు పొంగి పోయాడు కుడా ... నేను రాసిన దానిని కూడా ఇంత సీరియెస్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారా అని బహుశా ఆశ్చర్య పడి ఉంటాడు !
ఒక్క సారిగా ప్రభుత్వం ఉల్లిక్కి పడింది. మీడియా కి ఇంత స్వాతంత్రం పనికి రాదు అని ఎట్టకేలకు నిర్యయించింది. కాసేలున్ని పెట్టి, టీవీ 5 ఎడిటర్స్ ని అర్రెస్ట్ కూడా చేసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు టీవీ 5 , సాక్షి టీవీ, ఎన్ టీవీ ని తూర్పారబట్టాయి. ఇంత అడ్డగోల వార్తలను నిర్దారించకుండా ఎలా ప్రసారం చేస్తారు అని గట్టిగానే ప్రస్నించాయి. వీరితో పాటు టీవీ 9 కుడా గళం కలిపింది. మా చానల్స్ మీద కొన్ని పత్రికలు విషం కక్కుతునాయి అని ఈ మూడు చాన్నేల్స్ తిరిగి తిట్టారు. సాక్షి ఏమో టీవీ 9 మా కన్నా ముందే ప్రసారం చేసింది అని సాక్షి టీవీ గొడవ మొదలుపెట్టింది. ఛి ఛి, మేము అలా చెయ్యలేదు, అయిన సాక్షి డి కే బొల్లి కబుర్లు అని టీవీ 9 రచ్చకీడ్చింది. చిన్న పిల్లలాగ ప్రజల సమక్షం లోనే వార్త సంస్థలు బాహాటంగానే ఇలా ఒకరి మీద ఒకరు మట్టి పోస్తున్నారు.
ఈ డ్రామా మొత్తం ఇంక ఒక కొలిక్కి రాలేదు కాబట్టి, తదుపరి విశ్లేషణ వచ్చే వారం ఇస్తాను. కాని కేవలం ఎడిటర్స్ ని అర్రెస్ట్ చెయ్యడం సబబు కాదు. చానెల్స్ కాని, పత్రికలు కాని , ఒకప్పుడు ఎడిటర్స్ చేతిలో ఉండేవి, ఇప్పుడు అంతా యాజమాన్యం ఏది చెప్తే అదే. ఎడిటర్స్ కన్నా యాజమాన్యం దే పై చెయ్యి ఉంది. యాజమాన్యం ని ఎందుకు వదిలేసారో మరి అంతు చిక్కటం లేదు. టీవీ 5 ఎడిటర్ వెంకట కృష్ణ అంటే నాకు ఇష్టం, అయన ప్రోగ్రాం నేను ఇంచు ఇంచు ప్రతి రోజు చూస్తాను,కాని ఈ సారి మాత్రం అయన చాలా పెద్ద తప్పే చేసారు. అర్రెస్ట్ చెయ్యడం సమంజసం ఆ కాదా అని చెప్పే పరిస్థితి లో నేను లేను కాని, చేసిన ఈ తప్పిదం మాత్రం పునరావృతం కాకుండా జరగాలి అంటే కటిన చర్యలు తప్పవు ఏమో మరి. మీడియా మీద నియంత్రణ ఎంతైనా అవసరం మరి. వచ్చే వారం మరింత వివరాలతో, చర్చా ని కొనసాగిద్దాం.
ఇది ఇలా ఉండగా, కేంద్ర మంత్రి శ్రీ చిదంబరం గారు పిలిచినా అఖిల పక్ష సమావేశం, తెలంగాణా/సమైక్యాంధ్ర మీద ఒక నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఎవరి వాదనలు వాళ్ళు వినిపించారు. హింస ని ఆపాలి అని అన్ని పార్టీలు విజ్ఞప్తి చేసాయి. బహుశా ఈ సారి హింస ఆగుతుంది ఏమో మరి, వేచి చూడాలి.