Sunday, January 22, 2012

అదన్నమాట! : జనవరి 15-21


ముఖ్యమంత్రి గారు డిల్లి వెళ్ళరు అండి. వెళ్ళిన రోజూ దాదాపు రెండు గంటలు ఘులాం నబి ఆజాద్ గారితో చర్చించారు. మరుసటి రోజూ మళ్ళి ఒక గంటనర్ర చర్చించారు. ఆ తరువాత సోనియా గాంధి తో ఇంకో గంట పైగా చర్చించారు. ఇన్ని గంటలు చర్చిస్తే ఏదో అయ్యిపోతుంది అని ఊహించాం. జరిగింది ఏంటి మరి ? - ఒకప్పటి చిరంజీవి పార్టీ కి సంభందించిన ఇద్దర్ని మంత్రివర్గం లోకి తీసుకున్నారు. శంకర్ రావు గారిని తప్పించారు! ఇంతే! 

బొత్స గారు కూడా డిల్లి వెళ్ళరు. ముఖ్యమంత్రి గారి తో కాకుండా, ఆయన వేరు గా మాట్లాడారు ఆజాద్ గారితో. ముఖ్యమంత్రి గారు ఏమో మంత్రివర్గ పూర్తి ప్రక్షాళన చేద్దాం అనుకుని వెళ్ళరు. బొత్స గారు దానికి వ్యతిరేకం అంట. అందుకే ఈ సారి బొత్స గారు గెలిచినట్టు వార్తల్లో రాసారు. బొత్స గారు యధాప్రకారం గా ఈ వార్తలని ఖండించారు అనుకోండి. 

అయితే, ఇక్కడ మనం చర్చిన్చోకవాల్సిన విషయం ఇంకోటి ఉంది అండి. చిరంజీవి గారు ఒకప్పుడు నడిపిన పీఆర్పీ కి చెందినా శ్రీ ఘంట శ్రీనివాస్ గారు, శ్రీ సి. రామచంద్రయ్య గారు మంత్రులు గా ప్రమాణ స్వీకారం చేసారు. వీరు ఇద్దరు 2009 వరకు తెలుగు దేశం సభ్యులు, ముఖ్యులు కూడా. వీళ్ళు ఏమి చిరంజీవి వల్ల పైకి వచ్చిన వాళ్ళు కాదు. చిరంజీవి తపపెట్టిన సామజిక న్యాయం వీళ్ళ వల్ల ఏ మాత్రం రాదు. చిరంజీవి కాంగ్రెస్స్ లోకి కలిసాక, ఆ పార్టి కే వోటు వెయ్యాలి అండి - బెదిరించి వేరే పార్టి కి వోటు వేసే అంత సీన్ లేదు ఆయనకి. రెండు మంత్రి పడవలు ఇస్తే తీసుకోవడం తప్పించి పెద్దగా చేసేది ఏమి లేదు. ఈ శాఖలు వద్దు, ఆ శాఖలు కావాలి అని మారాం చెయ్యడం చాల విడ్డురంగా ఉంది. 

ఏదైతే ఎం - చిరంజీవి గారిని నమ్ముకున్న వారికి చెడు అనుభవాలే మిగిలాయి. ఎప్పటి నుంచో ఆరి తేరిన నాయకులు ఇద్దరు మంత్రులు అయ్యారు. అదన్నమాట! 

0 comments:

Post a Comment