Sunday, February 20, 2011

అదన్నమాట! : ఫిబ్రవరి 13-19

"ఫీజు పోరు" - ఇది మన ప్రియతమ నేత శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పటిన దీక్ష పేరు. ఏడు రోజులు పాటు దీక్ష చేస్తారు అంట ! ఇంతకి ఈ ఫీజు గోల ఏంటి ? నాలుగేళ్ల క్రితం, వైఎసార్ గారు ఒక పధకం పెట్టారు. ఏడాది కి లక్ష రూపాయలు కన్నా తక్కువ ఆదాయం ఉన్న ఇళ్ళలో, ఇంజనీరింగ్, ఎంబీయే , ఎమ్సీయే లాంటి కోర్స్లు చేసే విద్యార్ధులకి ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది ! ఈ పధకం వల్ల మంచి పేరు రావడం తో, మరిన్ని విద్యార్ధులకు పనికి వచ్చేలా ఈ పధకాన్ని వర్తిమ్పచేసింది. ఫలితంగా, ఏడాది కి 3500 కోట్లు కర్చు పెట్టె పరిస్థితి వచ్చింది. అంత డబ్బులు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర లేదు మరి ! ప్రతి డిగ్రి కోర్సు కి, ఇంటర్మీడియట్ చదువు కి కూడా ఈ పధకాన్ని, ముందు చూపు లేకుండా, వర్తింప చేసింది. ఇప్పుడు ఏమో కాలేజులు ఫీజులు చేల్లిన్చందే, మేము ఇంకా నడపలేము అంటునారు ! ప్రభుత్వం ఏమో, ఇప్పుడు ఒక 1000 కోట్లు ఇస్తాము, మిగతాది తరువాత చూస్తాం అంటున్నారు. ఈ డబ్బు క్రిందటి సంవత్సరం రావాల్సిన డబ్బులు! యాజమాన్యాలు మాత్రం కనీసం సగం ఫీజులు అయిన చేలించందే , మేము ఇంకా కాలేజి నడపలేము అని తెగేసి చెప్పారు ! ఈ పధకం లో కొన్ని సంస్కరణలు తెద్దాము అని రోశయ్య సర్కారు ప్రయత్నించింది. కనీసం 75 %రోజులు కాలేజి కి రావాలి అని, అన్ని సబ్జక్ట్లలో పాస్ అవ్వాలి అని - ఇలా కొన్ని కొత్త రూల్స్ పెడదాము అని ఆలోచన చేసింది. కాని, మన రాజకీయ నాయకులు దీనికి ఒప్పుకోలేదు! ఇప్పుడు ఏమో రభస సృష్టిస్తున్నారు!

తెలంగాణా రాష్ట్ర సమితి వల్ల హింసాత్మక విధానాలకు అడ్డు అదుపు లేకుండా పొయ్యింది ! లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ గారి మీద, ఒక టీఆరఎస్ కార్యకర్త (ఎంఎల్యే డ్రైవర్ అంట) దాడి కూడా చేసారు ! అసెంబ్లీ లో గవరనర్ ప్రసంగిస్తూ ఉంటె, అయన దగ్గర నుండి ఆ పత్రాన్ని లాగేసుకున్నారు! మరుసటి రోజూ, కనీస మర్యాద కూడా చూపించకుండా, మీడియా మీద విజ్రుమ్భించారు! ఈ గోల ఎప్పుడు ఆగుతుందో, ఎంతో !

0 comments:

Post a Comment