Tuesday, December 8, 2009

ఉద్యమమా ? అరాచకమా?

మొన్న చందన బ్రదర్స్ షాప్ లోకి ఇలా వెళ్లి, అలా కొనుకున్ని, ఇలా బయటకి వచ్చేదాం అని లోపలికి వెళ్ళా . అనుకునట్టే ఇలా వెళ్ళా, అలా కోనేసా, ఇలా కిందకి వచ్చేసా. ఇక్కడ కథ లో మలుపు.

కిందకి వచ్చేసరికి షాప్ షట్టర్స్ మూసేశారు ! ఎందుకు మూసేశారు అని అడిగితె, బయట తెలంగాణా విద్యార్ధులు ర్యాలి నిర్వహిస్తున్నారు, షాపుల మీదకి రాళ్ళు విసురుతున్నారు, అందుకే మూసేసాము అన్నారు. పది నిమషాల తరువాత బయటికి వదిలారు. బయట ఉన్న మా అమ్మ నాన్న తో కలిసి నేను ర్యాలి వెళ్ళిన దారిలోనే ఇంటికి వచ్చేసాము.

ఇంటికి వచ్చి టీవీ పెడితే, అక్కడ ఏదో పెద్ద స్థాయి లో అరాచకం జరిగినట్టు, మొత్తం జన జీవనం అల్ల కల్లోలం అయినట్టు, భయ భ్రాంతులు కలిగించే వాతావరణం ఉన్నట్టు మన టీవీ చానల్స్ ఆపకుండా ఢంకా మొగిస్తూనే ఉన్నాయి. అయుదు అంటే అయుదే నిమషాలు ముందు మేము నడిచి వచ్చిన చోటు నుంచి సాక్షి టీవీ విలేకరి అయితే, "ఇక్కడ యుధ వాతావరణం ఉంది " అని తేల్చి చెప్పేశారు! దీని ఫలితం - రెండు గంటల్లో రాజధాని నగరం మొత్తం మూతబడి పోయింది. మీడియా అందించిన ఈ అద్భుతమైన సహకారం తో రెట్టింపు ఉత్సాహం వచ్చిన తెరాసా పార్టీ, రెండ్రోజుల తెలంగాణా బంద్ కు పిలుపునిచ్చింది. ఒక అర గంట పాటు కొంత మంది అరాచక శక్తులు కొన్ని షాప్లు మీదకి రాళ్ళు రువ్వితే, మొత్తం రాజధాని నగరం, ఆ పై మొత్తం తెలంగాణా జిల్లాలలో జన జీవినం అస్త వ్యస్తం అయ్యిపోయింది.

ఇంత మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ వ్యక్తులు అసలు ఎవరు ? ఉద్యమం పేరు చెప్పుకుని అరాచకాలకు పాలు పడి, ఎవర్ని మోసం చేద్దాం అని ప్రయత్నిస్తున్నారు ? ప్రజా స్వామ్యం లో ప్రజలే తీర్పే శిరోధార్యం. నాకు ప్రజలు తీర్పు నచ్చలేదు, నేను రోడ్లేక్కి విర్ర వీగుతా అంటే ప్రజా స్వామ్యం ఎలా ఒప్పుకుంటుంది ? తెలంగాణా కి అనుకూలంగా తెదేపా, తెరాసా, భాజపా, ప్రరపా - ఈ నాలుగు పార్టీలు మద్దత్తు పలికాయి. ఈ నాలుగు పార్టీలు ఎన్నికల్లో ఓటమి ని చవి చూసాయి. ప్రజలు ఇంత నిర్ద్వందంగా తీర్పు ని ఇస్తే, కేవలం ఆరు నెలలలో కృంగిపోతున్న తన రాజకీయ జీవిఒతాన్ని పునరుద్ధరించడానికి కేసీఆర్ గారు ఆడుతున్న కపట నాటకాన్ని బయట పెట్టడం మానేసి, విచ్చల విడి గా పెట్రేగిపోతున్న అరాచక శక్తులకి మీడియా సంఘీభావం పలకడం అత్యంత దురదృష్టకరం. అరాచకాన్నిఉద్యమం గా చిత్రీకరిస్తూ మీడియా నడుపుతున్న ఈ బూటకపు ప్రచారాన్ని ముందు తప్పు బట్టాలి.

వైఎసార్ చనిపోయిన తరువాత ఇక తెలంగాణా కి అడ్డు ఎవరు అని బహుశా కేసీఆర్ భావించి ఉండవచ్చు. కాని రెండు-మూడు కోట్ల జనాభా ఉన్న తెలంగాణా ప్రాంతం లో కొన్ని వేల మంది చట్టాన్ని వాళ్ళ చేతి లోకి తీసుకుని విచ్చల విడి గా ప్రజలను భయ భ్రాన్తులకు గురి చేస్తే, దీనికి ఉద్యమం అనే పేరు పెట్టడం ఎంత వరకు సమంజసం? కేసీఆర్ గారి కొడుకు, శ్రీ కేటిఆర్ గారు టీవీ మీదకి వచ్చి, నల్గొండ జిల్లలో కాటి కాపరులు తెలంగాణా వ్యతిరేకుల శవాల్ని కాల్చారు అని చెప్పినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలిపితే, ఇంత కన్నా నీచానికి ఎవరైనా దిగాగలరా అండి ? పొద్దున్న అనక, రాత్రి అనక, రోజూ తెరాసా నేతలు కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారే, దీనిని ఉద్యమం అని పిలవడానికి మనసు ఎలా వస్తుంది అండి ?

ఇప్పట్లో తెలంగాణా వస్తే, అదీ ప్రజల తీర్పు ని అగౌరవ పరచడమే అవుతుంది. ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రెచ్చిపోతున్న వారి డిమాండ్లకు తలోగ్గితే రేపు పొద్దున్న ఇంక ఎవరు పడితే వాళ్ళు, ఇలాంటి దండగ పద్ధతులకే పూనుకుంటారు. కేసీఆర్ ఆడుతున్న ఈ నాటకానికి ఇంకా తెర దించే సమయం వచ్చింది. నీకు ఏదైనా బాధలు ఉంటె, ప్రజల్లోకి తీసుకు వెళ్ళు, వారి మన్నలు పొందు, ఎన్నికలు గెలువు, అప్పుడు డిమాండ్ చెయ్యి. అంతే కాని నీచమైన రాజకీయాలకు పాల్పడి ప్రజల శాంతియుత జీవితాల్లో కలకలం సృష్టించి నీ ఆశయం సాధిద్దాం అనుకుంటే, అదీ జరిగే పని కాదు !

1 comments:

Arun said...

Congress General Secretary Rahul Gandhi courted a controversy by asking the pilot of his helicopter to land in poor light at Sitapur here last evening.

State Congress chief Rita Bahugana expressed her concerns over this act.

The landing appears to be a violation of the air safety guidelines issued by the Director General of Civil Aviation (DGCA).

http://in.news.yahoo.com/139/20091208/808/tnl-rahul-gandhi-courts-a-controversy-as.html

Post a Comment