Sunday, October 4, 2009

అదన్నమాట! : సెప్టెంబర్ 27 - అక్టోబర్ 3

1. రాష్ట్రం లోని మూడు జిల్లాలను ముంచెత్తిన వరదలు వంద ఏళ్ళ చరిత్ర లో ఎప్పుడు సంభవించలేదు. ఒప్పుకోవాల్సిన మాట ఏమిటి అంటే, మన మీడియా, సాక్షి టీవీ తో సహా, చాలా బాధ్యతాయుతంగా ఈ వరద భీబత్సాన్ని కవర్ చేసింది. వార్త ప్రతినిధులు అందరు కూడా లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లి, పడవల్లో ముంపు ప్రాంతాల లోకి వెళ్లి, అక్కడ బాదితులకి కావాల్సిన సమాచారాన్ని అందచేస్తూ, అలాగే వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వ ద్రుష్టి కి తీసుకువస్తూ, రాజకీయం వైపు చర్చా ని మల్లించకుండా, కేవలం సహాయ కార్యకలాపాలకి తోడ్పాటు ఇచ్చారు. అక్కడ ఇక్కడ, అడపా దడపా కొన్ని ఇబ్బందికర కామెంట్స్ చేసినా, మొత్తం మీద చుస్తే, ఈ రెండు మూడు రోజులు గా మీడియా పోషించిన పాత్ర ప్రశంసనీయం.

2. ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే, మన ముఖ్యమంత్రి రోశయ్య గారు ప్రతి 4-5 గంటలకి ఆయనే స్వయం గా మీడియా సమావేశం కి వచ్చి, పూర్తీ వివరాలను ఇచి, రాత్రి అంత ఆఫీస్ లోనే ఉంది సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడం. ప్రతిపక్షాలు కూడా అనవసర రాద్దంతాలు చెయ్యకుండా, పూర్తీ గా ప్రభుత్వానికి సహకరించడం కూడా కొంచం కొత్తగా ఉంది, కొంచం ఉపసమనం కూడా కలిగించింది.

3. వరద భీబత్సాన్ని చుస్తే వణుకు వస్తుందండీ బాబు. అన్ని అడుగుల నీళ్ళు ఎప్పుడు వెనక్కి వెల్తాయో తెలిదు, అవి వెనక్కి వెళ్ళాక అంటు వ్యాధులు ఎలా ప్రభలుతాయో తెలిదు, అసలు ఆ నీళ్ళు వెళ్ళాకా సాధారణ జీవితానికి రావడానికి ఎంత సమయం పడుతుందో, ఇంట్లోకి నీళ్ళ తో పాటు ఇంకా ఏమి ఏమి వచ్చాయో, అసలు ఒక్కొక్క ఇల్లుని శుబ్రం చెయ్యడానికి ఎన్నాలు పడుతుందో, ఇల్లు కోలుపోయిన వారి పరిస్థితి ఏంటో, ఇవి అనీ తలుచుకుంటే అసలు మనసు చలించిపోతుంది.

4. "జన హృదయ నేత" వై ఎస్ ఆర్ తనయుడు, ఆయిన ఆశయాలకు ఏకైక "వారసడు" ఆయినా జగన్ మోహన్ రెడ్డి గారు, ఇరవై లక్షలు ఇచ్చారు అంట వరద సహాయ నిధి కి. అసలు అయన లెవెల్ కి అయన ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చారు! చిరంజీవి కొడుకే పది లక్షలు ఇచ్చారు! మరి ఈయన ఏంటో ఇరవై లక్షల తో సరిపెట్టుకునారు!

5. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్స్ ప్రభుత్వాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పెద్దగ విమర్సించకర్లేదు. ఎందుకో తెలుసా? ఆ పని సాక్షి టీవీ చెయ్యడం మొదలు పెట్టింది లెండి! "రైసయ్య" అంటు ఒక హెడ్లైన్ ఇచ్చి ఒక వార్త ప్రసారం చేసింది. ప్రభుత్వ ఖజానా ఖాళి అయ్యింది అని, అందు వాళ్ళ బియ్యం సరిగ్గా పంచటం లేదు అని, వై ఎస్ ఆర్ ఆసలకు ఈ ప్రభుత్వం గండి కొడుతుంది అని ఆ వార్త సారాంసం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాలేదు అని వై ఎస్ ఆర్ గారే ఒప్పుకునారు, అప్పుడు మీరు నిద్ర పోతున్నారా?

0 comments:

Post a Comment