"క్రిందటి ప్రభుత్వం లో భూ పంపిణీల విషయం లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవమే" - అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు సెలవు ఇచ్చారు. క్రిందటి ప్రభుత్వం అంటే ఎవరిదీ అండి? ఏదో అనమికుదుడి అయ్యినట్టు మాట్లాడుతున్నారు ఈయన ! వైఎసార్ గారిదే కదా? జగన్ గారి మీ పార్టి వదిలి వెళ్ళిపోయారు కదా - ఇప్పుడు ఏమైనా మాట్లాడేస్తార సార్ మీరు?
అసలు ఈ వ్యాఖ్య చెయ్యడానికి ముందు రోజూ ఇంకో దరిద్రమైన సంఘటన ఒకటి అసెంబ్లీ లో జరిగింది అండి. "వైఎసార్ దొంగల ముఠా " అంటూ తెలుగు దేశం పార్టి వాళ్ళు బ్యాన్నేర్స్ పట్టుకున్నారు అండి. కోపం తో ఉగిపోయిన అయన తమ్ముడు యైఎస్ వివేకానంద రెడ్డి గారు సదరు ఎంఎల్యే దగ్గరకు వెళ్లి ముందు ఆ పేపర్ లాగేసి, తరువాత అయన మీద చెయ్యి చేసుకున్నారు! ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రి అయిన ఆయన , సాక్షాతూ అసెంబ్లీ లో ఇలా రౌడి లాగ ప్రవర్తించడం ఎంత సబబు అండి ? మంత్రి గా ఉంది, ఎంఎల్యే కి కొడతార అండి? కేవలం క్షమాపణ తో వదిలేస్తార అండి? అసలు ఈ మనిషి ని మంత్రి పదవి నుంచి తొలగించాలి. కాని మన ముఖ్యమంత్రి గారు చెయ్యరు అలాగా. మంత్రి క్షమాపణ చెప్పారు అంట, కాబట్టి ఇంకా మనం మర్చిపోవాలి అంట! కాంగ్రెస్స్ పార్టి రాజకీయాలు ఈ రాష్ట్రాన్ని అదః పాతాళం లోకి తీసుకువేల్తున్నాయి. అయిన సరే, నోరు మూసుకుని చూడడం తప్పించి ఏమి చెయ్యలేము.
ప్రతిపక్షం మొత్తం ఒక్కట్టి అయ్యి గత ప్రభుత్వం కేటాయించిన భూములు అన్నిటి మీద ఒక కమిట్టీ వెయ్యాలి అని పట్టుబట్టాయి. ఆ డిమాండ్ లో భాగమే తెదేపా ఎమ్యెల్యేలు ప్రదర్శించిన ప్లకార్డ్లు! ఎట్టకేలకు ప్రభుత్వం ఒప్పుకుంది ఒక కమిటీ వెయ్యడానికి. ఆ కమిటి వేస్తునట్టు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి గారు పై వ్యాఖ్య చేసారు. వైఎసార్ గారు దోచుకున్నారు అని చెప్పడానికి ఇంత కన్నా నిదర్శనం ఏమి కావాలి అండి మనకు!
1 comments:
kadapa ennikalu drusti lo vunchukoni YVK garu knchm ovr chesuntaru.. sriman kiran garu jagan party ni edurkovalnte chettu ni kadu modhalu ni target cheyyalani vuddesam tho ala matladi Committee vesuntaru...
Post a Comment