ఆగస్ట్ 19, 2009 నాడు ఈనాడు దిన పత్రిక లో పతాక శీర్షిక - "జెండా పీకేద్దామా" . అలా అని పలు ఎమ్యెల్యేలు అల్లు అరవింద్ తో అన్నట్టు యా కధనం సారాంశం. ఆ కధనం తో ఊగిపోయిన చిరంజీవి గారు, పత్రిక సమావేశం ఏర్పాటు చేసి - మా జెండా ని ఎవరు పీకలేరు. ఇంకా గట్టిగా ప్రజల గుండెల్లో పాతుకుపోయేలా మా జెండా ని పటిష్థం చేసుకుంటాం అని ప్రగల్భాలు పలికారు. పార్టి లో మిగిలిన కొద్ది పాటి కార్యకర్తల్లో నూతన ఉత్శాహాన్ని నింపే ప్రయత్నం చేసారు.
అసలు "పీకేస్తారు" అన్న అనుమానం ఎందుకు వచ్చింది?
కధ ని కొంచం వెనక్కి తిరగేస్తే ...
ఆగస్ట్ 17, 2008 మధ్యానం 2:30 కి శ్రీమాన్ చిరంజీవి గారు పత్రిక సమావేశం ఏర్పాటు చేసారు. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు అన్న విషయం అప్పటికి అందరికి తెలిసిందే. కాని ఆ రోజూ ఆయన పత్రిక ముఖంగా తన రాజకీయ ఆరంగేట్రాన్ని వెల్లడించారు. ఎక్కడ ఈయన సమావేశం తప్పిపోతాను ఏమో అనుకుని, మా చుట్టాలు భోజనానికి పిలిచినా, చిరంజీవి గారు తన సమావేశాన్ని ముగించే వరకు చూసి అప్పుడు వెళ్ళాను !! భోజన ప్రియుడు అయన నేను , దానిని కూడా వదులుకుని మరి ఎంతో ఉత్సాహం తో ఎదురు చూసాను చిరంజీవి గారి రాజకీయ రంగ ప్రవేశాన్ని !!
ఆగస్ట్ 26,2008 సాయంత్రం ఆరు గంటల సమయం లో లక్షాలాది జనం మధ్యలో, ఇక రాబోతున్నది మీ రాజ్యం - "ప్రజా రాజ్యం" అని ఉద్ఘాటించారు శ్రీమాన్ చిరంజీవి గారు. మురిసిపోయము. రాజకీయాలో తో వేగిపోయి ఉన్న ప్రజలకు ఈయన కొత్త ఊపు ని ఇస్తారు అని ఆశ పడ్డాము. కొత్త తేజస్సు వస్తుంది అని ఎదురు చూసాము. కొత్త రాజకీయం అవతరిస్తుంది అని ఆనంద పడ్డాము. ఆశ నిరాస అవ్వడానికి సరిగ్గా గంట సేపు పట్టింది. ప్రజా రాజ్యం సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అని చిరంజీవి గారు అనర్గళంగా వివరిస్తారు అని అనుకుంటున్న సమయం లో - తనకి రాసి ఇచ్చిన కాగితాలు నుంచి చదివేశారు. "గాంధి ఆస్పిత్ర లో మంచం కూడా ఇవ్వలేమ " అన్న చిన్న చిన్న విషయాలు కూడా అయన చదివే చెప్పారు.
ఆ మరుసటి రోజూ నుంచి వరసు గా వలసలు మొదలు అయ్యాయి. మరుసటి రోజూ నుంచే. కొంచం వ్యవధి కూడా ఇవ్వలేదు చిరంజీవి గారు. వలసలు మొదలు అయిన ఒక నెల వరకు కనీసం ప్రజల్లోకి వెళ్ళలేదు. నెల తరువాత వెళ్ళరు. మార్పు తెచ్చేస్తా, పీకేస్తా, బరికేస్తా అని ప్రసంగాలు ఇచ్చారు. అలా చెప్పడం, ఇలా వలస పక్షుల్ని పార్టి లోకి చేర్చుకోవడం. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి విచ్చలవిడి గా నోరు పారేసుకున్నారు. కాంగ్రెస్స్ నాయకుల పంచెలు ఉదాతీద్దాం అని సెలవు ఇచ్చారు. అన్నయ సమర్ధించారు.
ప్రసంగాలు మూస పద్దతి లో సా ... గుతూనే ఉన్నాయి. అవినీతి ని అంతం చేసేస్తాం, పీకేస్తం, బరికేస్తం అని చిందులు తొక్కారు. పని లో పని ని తెలుగు దేశం పార్టి మీద కూడా చిందులు తొక్కారు. సామజిక న్యాయం తెస్తాం అని కబుర్లు చెప్పారు. వంద మంది బీ సి లకి సీట్లు ఇచ్చాము అని గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అల్లు అరవింద్ గారు సీట్లు అమ్ముకుంటున్నారు అని ప్రచారం మొదలు అయ్యింది. ఇది కాంగ్రెస్స్, తెలుగు దేశం పార్టీల కుట్ర అని మనకి సెలవు ఇచ్చారు. సీట్ల పంపకం కుడా చాలా అష్ట వ్యస్తంగా జరిగింది. పార్టి అధ్యక్షుడు ఏమో ప్రచారం లో ఉంటారు - అల్లు అరవింద్ గారు నిర్ణయాలు తీసుకుంటారు. తరువాత చిరంజీవి కి చెప్తారు. అయన సరే అంటారు ! ఎవరికీ టికెట్ వస్తుందో, ఎవరికీ రావటం లేదో చివరి నిమిషం వరకు తెల్చనే లేదు.
ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదండీ. కొత్త రాజకీయం కాదు, అదే చెత్త రాజకీయం ప్రజా రాజ్యం కూడా చేస్తుంది అని గ్రహించారు. 18 సీట్లు మాత్రమె ఇచ్చారు ఆ పార్టి కి. 70 లక్షల మంది వోట్ వేసారు. అంత మంది వోట్ వేసిన ఇంత తక్కువ సీట్లేనా అని ఆశ్చర్య పోయారు. పోన్లే, సీట్లు రాకపోతే ఏమైంది లే, వోట్లు వచ్చాయి కదా అని సర్దుకున్నారు. ఇన్ని తక్కువ సీట్లతో ఏమి చెయ్యగలం అని బాధ పాడడం మొదలుపెట్టారు. నెమ్మది నెమ్మది గా కళ్ళు తెరుచుకున్నారు. నమ్మి పని చేసిన అభిమానులని కాదు అనుకుని, వలస వచ్చిన నేతలతో సావాసం చేసి ఎంత నష్టపోయారో వాళ్ళకి అర్ధం అయ్యింది. అర్ధం అయిన ఏమి చెయ్యలేని పరిస్థితి. పోగట్టుకున్న నమ్మకం తిరిగి సంపాదించు కోవడం ఎలాగో తెలియలేదు. ఈ లోపల రాజకీయం గా ఎలా ఎదగాలో ఆలోచించడం మొదలు పెట్టారు. వాళ్ళకి తట్టిన కొద్ది పాటి అలోచోనల్లో ముఖ్యమైన ఆలోచన - "జెండా పీకేదామా" !
ఈ శీర్షిక, అటు పిమ్మట, చిరంజీవి గారి ఉద్ఘాటన జరిగిన పక్షం రోజులకే వైఎసార్ గారు చనిపోయారు. వైఎసార్ ఆకాల మరణం వీరికి వారం లాగ కలిసి వచ్చింది. ఒకే సారి ప్రజా రాజ్యం దగ్గర ఉన్న 18 ఎమ్యెల్యేలు అమూల్యం అయిపోయారు. జగన్ ఏ నిమిషానికి ప్రభుత్వం కూలుస్తారో అన్న భయం లో పడ్డ కాంగ్రెస్స్ చిరంజీవి ని మచ్చిక చేసుకోవడం మొదలు పెటింది. చిరంజీవి కూడా మురిసిపోయారు. తనకంటూ ఒక గుర్తింపు వచ్చింది అని ఆనదించారు. ఒకే సారి రాష్ట్ర రాజకీయాల్లో తనకి లభించిన ఈ ఉన్నత అవకాశాన్ని వదులుకోవడం ఆయనకి దేవుడు ఇచిన వారం లాగ భావించారు కాబోల్లు. కాంగ్రెస్స్ తో పొత్తు కి సిద్దం అయ్యారు. అయితే కాంగ్రెస్స్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిన్చేసరికి ఆ పొత్తు ఆది లోనే తెగిపోయింది. పర్వాలేదు లే, మళ్ళి అవకాశాలు రాకపోవా అని ఎదురు చూసారు. ఈ మధ్యలో ప్రజలు తన ఉనికి ని మర్చిపోతారు ఏమో భయం వేసినప్పుడల్లా , కాంగ్రెస్స్ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు. ఈ ప్రభుత్వం చేత కాని ప్రభుత్వం, రైతులకి ఏమి చెయ్యలేని ప్రభుత్వం అంటూ మనకి సెలవిచారు. ఇలా అంటూనే, కాంగ్రెస్స్ పార్టి అభ్యర్దికి రాజ్య సభ ఎన్నికల్లో మద్దతు పలికారు.
జగన్ పోరు పడలేక సతమతం అవుతున్న కాంగ్రెస్స్ కి చిరంజీవి "ఆపత్భండువుడు" లాగ కనిపించాడు. చిరంజీవి కూడా ఎప్పుడు విలీనం చేసేద్దామ అని ఎదురు చూస్తున్నారు. ఇక ఆలసించిన ఆశ భంగం అని ఇరు వర్గాలు అనుకున్నాయి. కాంగ్రెస్స్ పార్టీయే ప్రజా రాజ్యం ని కోరినట్లు ఒక చిన్న నాటకం ఆడించారు. వాళ్ళు అడిగారు కాబట్టి మేము ఒప్పుకుంటున్నాము అని మనల్లని ఒప్పించే ప్రయత్నం చేసారు. చివరికి ఫెబ్రవరి 6 , 2011 న చాలా మందిని నొప్పిస్తూ, చిరంజీవి గారు ప్రజా రాజ్యపు జెందని పీకేశారు.
జెండా తో పాటు మార్పు కి తను వేసిన బీజం, పెరిగే లోపల పీకేశారు. చిరంజీవి మార్పు తెస్తాడు, తెచ్చే వరకు పోరాడతాడు అని నమ్మిన ప్రతి వ్యక్తీ కి గట్టిగ చెంప దెబ్బ కొట్టాడు. మా జెండా ఎవరు పీకలేరు అని ప్రగల్భాలు పలికిన ఏడాదిన్నర లోపలే, జెండా పీకేసి, "మ్యాడం" కి సమర్పించేసారు. ప్రజా రాజ్యం అధ్యక్షుడు నుంచి "మ్యాడం ఏ పదవి ఇస్తే, ఆ పదవి నిర్వహిస్తాను" అని చెప్పే స్థాయి కి దిగిపోయారు. మార్పు తెస్తా, పీకేస్తా, బరికేస్త అని మొదలుపెట్టి, తానె మారిపోయాడు. హాయ్ కమాండ్ సంస్కృతి కి జై కొట్టాడు. నమ్మిన అభిమానులకి చెంప దెబ్బ కొట్టాడు.
6 comments:
Good one Sudhir. Only forgot one more thing. Somewhere along the time, Chiranjeevi also lost interest in Politics I think, and wanted to re enter movies..and thats why the recent liposuction. Real "Useless fellow"!! - Rao
very nice ......edo jaruguddankukunte 3 years tarvata asalu party a ledu chepukodaniki...
పత్రికా సమావేశం రోజు గురించి, పార్టీ ప్రకటన రోజు గురించి చాలా బాగా చెప్పారు..
Amma Said
Chala baga vrasavu kaani, jenda peekedemu ane seershika eenaadu lo raledu. Andhrajyoti lo vachindi, aunduke andhrajyoti office addaalu pagala gontaru.
i think...chiru dont know decision-making....that made the all difference........
papam chiru matalni meeru artham chesukolenattunaru marpu thechadu kada
1.Genda lo marpochindi(PRP to Congress)
2.Dressing style lo marpochindi(pant shirt to khaddar)
3.Matallo marpochindi(currupt congress to divine congress)
4.Finally party symbol lo marpochindi(rail engine to hastam)
Post a Comment