Sunday, December 13, 2009

అదన్నమాట! : డిసెంబర్ 6-12

"అర్ధరాత్రి స్వాతంత్రం " అని ఒక చానెల్ పెద్ద పెద్ద అక్షారాల తో వివరించింది. ఇంకో చానెల్ అయితే "ఎన్నాలో వేచిన ఉదయం" అంటూ డిసెంబర్ పదో తారేకు ఉదయం మనకి తేల్చి చెప్పింది!ముందు రోజు అర్ధరాత్రి, శ్రీ చిదంబరం గారు, కనీసం మన ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా తెలంగాణా ఏర్పాటు ప్రకిర్య ని మొదలు పెడుతునట్టు ప్రకటించారు. చాక చక్యంగా ఈ ప్రకటన సోనియా గాంధి గారి పుట్టిన రోజున వెలువడింది. ఒక పత్రిక అయితే ఏకంగా "పుట్టిన రోజు" కానుక గా కూడా అభివర్ణించింది. అర్ధరాత్రి జరిగిన ఈ విపత్కర పరిణామానికి ఉల్లిక్కి పడి లేచిన ఆంద్ర/రాయలసీమ ప్రాంత వాసులు ఒక్క సారి గా నిరసన గళం వినిపించడం మొదలు పెట్టారు. ఇంతలోనే ఎమెల్యేలు ఎంపీలు రాజీనామాలు ఇవ్వడం మొదలు పెట్టారు. రెండు రోజుల్లో 135 మంది ఎమెల్యేలు రాజినీమ ఇచ్చారు అంటే, పరిస్థితి ఎంత చెయ్యి దాటి పోయిందో అర్ధం అయ్యి ఉంటది మీకు ! రాష్ట్రం లో ఎన్నడు చోటు చేసుకొని విపత్కర పరిస్థితులు ఈనాడు ఏర్పడాయి.

ముఖ్యమంత్రి రోశయ్య గారు ఏమో ఇంక చేతులు ఎత్తేసారు. కేంద్రం ఎలా చెప్తే అలా నడుచుకుంటారు అంట! తెదేపా లో ముదిరిన సంక్షోభం నుండి నాయుడు గారు ఇంక తేరుకోలేదు. ఇది ఏదో బాగుంది కదా అని ప్రరప ఎమెల్యేలు కూడా రాజీనామా ఇచ్చేసారు! ఇలా ఎవరు పడితే వాలు, విచ్చలవిడి గా రాజీనామా ఇచ్చేస్తే మరి ఎవరు పరిపాలిస్తారు అండి? ఈ రాజీనామాల హడావిడి లో అసలు సోనియా గాంధి గారు ఎంత పెద్ద తప్పు చేసారో ఎవరు ప్రస్నిచడం మరచిపోయారే? రాష్ట్ర ముఖ్యమంత్రి కి కూడా తెలియకుండా నిర్ణయం ప్రకటించారు, ఇదేమైనా సబబు గా ఉందా? కేవలం మూడే రోజుల్లో నిర్ణయం మార్చుకునారే, ఇదేమైనా సబబు గా ఉందా? రాష్ట్రం ఇంతల అత్తుడుకుపోతుంటే, కనీసం మాటైన చెప్పటం లేదే, ఇదేనా 33 ఎంపీలు పంపిన రాష్ట్రానికి మీరు ఇచే మర్యాద? గౌరవం?

0 comments:

Post a Comment