Monday, December 28, 2009

అదన్నమాట! : డిసంబర్ 20-26

1. తెలంగాణా, ఆంద్ర, రాయలసీమ, హైదరాబాద్ .... ఇలా విని విని మనకి విసుగు వచ్చింది అని రాష్ట్ర గవర్నర్ శ్రీమాన్ ఎన్.డి.తివారి గారికి అనిపించింది ఏమో.రాష్ట్ర ప్రజలకి కి కొత్త సమస్య ని ఏదైనా సృష్టిద్దాము అని అనుకునట్టు ఉన్నారు.. అందుకే అత్యంత నీచంగా ఏకంగా రాజ్ భవన్ లోనే రాస లీలలు కు పూనుకున్నారు. ఇటువంటి వ్యక్తులు అసలు ఈ వృతి కే పెద్ద కళంకం. ఈయన ఒకప్పుడు భారత రాజకీయాల్లో కీలకమైన వ్యక్తీ. ఇలాంటి దుర్బుది తో ఎంత మంది జీవితాల్ని ఎన్ని విధాలుగా నాశనం చేసాడో మరి.అవన్నీ నిగ్గు తేల్చాల్సిన సాయం ఇది. కాని కేవలం అయన రాజీనామా తో మనం సంతృప్తి పడిపోతాము. అదే మన దౌర్భాగ్యం.

2. కేంద్ర హొం మంత్రి శ్రీ చిదంబరం గారు ఈ వారం మళ్ళి ఒక కొత్త ప్రకటన చేసారు. తెలంగాణా రాష్ట్రం స్థాపించే చర్యలు తీసుకుంటాము అని ప్రకటన చేసినప్పుడు అన్ని పార్టీలు సరే అని చెప్పాయి, కాని ఆ తరువాత ప్రజల నుంచి వచ్చిన విపరీతమైన అసమట్టి ని దృష్తి లో పెట్టుకుని, తెలంగాణా అంశాన్ని ఇంక విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంది అని ప్రకటన చేసారు. ఇంక మన ఆరాధ్య హాస్య నటుడు శ్రీమాన్ కేసీఆర్ గారు ఎందుకు ఊరుకుంటారు! అయన ఎప్పట్లాగే నోటికి వచ్చినట్టు ఏదో వాగి, అన్ని పార్టీలని కలుపుకుని ఉద్యమం చేస్తాము అని మళ్ళి సెలవు ఇచ్చారు మనకి. ఇది కాకా, మళ్ళి 48 ఘంటల బంద్ అంట. మళ్ళి జన జీవనం అస్త వ్యస్తం. కాని శ్రీమాన్ గారికి ఇవెఇ పట్టవు కదా అండి. బస్లున్ని తగలపెట్టాలి, షాప్ల అద్దాలు పగలకోట్టాలి, ప్రజల్లో భయం పెంపొందించాలి ... ఇదే ఆయనకు తెలిసిన విద్య. రాష్ట్ర ప్రబుత్వం పూర్తి గా చేతులు ఎత్తేసింది. ముఖ్యమంత్రి గారు ఏదో నామ మాత్రంగా పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమో అగ్గి రగిలించి, మంటలు తామంతట తామే చల్లరిపోతాయి అని వేచి చూస్తుంది. సామాన్య పౌరుడు మాత్రం నలిగిపోతున్నాడు.

3. విద్యార్దులని కలవడానికి వెళ్ళిన తెదేపా ఎంఎల్యే శ్రీ నాగం జనార్ధన్ రెడ్డి గారిని కొంత మంది కొట్టారు. ఒక ఎంఎల్యే నే కొట్టే స్థాయి కి ఈ అరాచకం వెళ్ళింది అంటే, ఇక ఎంత దిగజారిందో మీరే ఉహంచండి.

0 comments:

Post a Comment