Sunday, November 29, 2009

అదన్నమాట! : నవెంబర్ 22-28

1. ఈ వారం లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు కాంగ్రెస్స్ కు షాక్ ని ఇస్తే, తెదేపా కి ఊపు ని ఇచ్చాయి ! మజ్లీస్ పార్టీ కి ఏకంగా 43 సీట్లు వచ్చి, కింగ్ మేకర్ స్థాయి కి ఎదిగిపోయింది ! పానకం లో పుడక లాగ పీఆర్పీ కి ఒక్క సీటు వచ్చింది లెండి! అదీ కాంగ్రెస్స్ రెబెల్ గా పోటి చేసిన అభ్యర్ది పీఆర్పీ నుంచి గెలిచాడు ! లోక్ సత్తా కి ప్రజలు మొండి చెయ్యి చూపించారు. ఇది ఉహించని ఎదురు దెబ్బ! మొత్తానికి ఈ ఎన్నికలతో స్పష్టం అయ్యింది ఏంటి అంటే, రాజశేకర రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీ చాటికల బడటానికి పెద్దగ సమయం అవసరం పడలేదు!

2. ఎట్టకేలకు ఈ వారం సీఎల్ల్పీసమావేశం జరిగింది! జగన్ గారే సోనియా గాంధి గారికి పూర్తి నిర్ణయాధికారాలను ఇస్తూ ఒక తీర్మానం చదివారు. అందరు తల ఊపారు. సోనియా గాంధి గారు రోశయ్య గారినే సీఎల్ల్పీ నాయకుడిగా నియమిస్తూ ఇవ్వాళ ప్రకటన జారి చేసారు. ఇంతోటి దానికి ఇన్నాళ్ళు ఆగడం ఎందుకో మరి?!

౩. ఆంధ్రుల అభిమాన హాస్య నటుడు శ్రీ కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెత్తబోతునారు. మరిన్ని వివరాలు వచ్చే వారం లో!

0 comments:

Post a Comment