Sunday, October 11, 2009

అదన్నమాట! : అక్టొబెర్ 4-10

1. రాష్ట్ర రాజకీయ వేదిక పై ఈ మధ్య తగ్గుముఖం పట్టిన కామెడి ని భర్తి చెయ్యడానికి కే.సి.ఆర్ గారు డిల్లి నుంచి తిరిగి వచ్చారు. వచ్చి రాగానే ప్రేలపించడం మొదలుపెట్టారు. తను చెప్పింది తప్పు అని రుజువు చేస్తే హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో ఉరి తీసుకుంటాను అని సవాల్ కూడా విసిరారు. సోనియా గాంధి ఏమో దయామయి అంట. సడ్దన్ గా ఇలా ఎందుకు అన్నారు అని అడగొద్దు, అయన తీరే అంత. రోశయ్య గారు, మహాత్మా గాంధి డి ఒకే కులం కాబట్టి, ఈయన కూడా మంచి ముఖ్యమంత్రి అవుతారు అంట! వరదలు వచ్చిన నాలుగు రోజులకి కాని సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ కి విచ్చేశారు. హెలికాప్టర్ నుంచి దిగుతూ కింద పడ్డారు కూడా! తన ఇల్లుని అమ్మి కూడా సహాయం చేస్తా అని మళ్ళి గట్టిగ ప్రేలపించి, హైదరాబాద్ కి వచ్చేసారు. దానికి తొడు ఈ మధ్య కంటి ఆపెరషన్ అయ్యింది అంట, నల్ల కలద్దాలు పెడుతున్నారు, చుదలేకపోతున్నాము అసలు !

2. ఎట్టకేలకు డిజిపి ఎస్ ఎస్ ఫై యాదవ్ ని తీసేసారు. మొత్తానికి ఒక బెడద వదిలింది ప్రభుత్వానికి. ప్రజలకి కూడా. లేకపోతె ఈయన చేసే పనుల్ని తట్టుకోలేక రోజు రోజుకి చిరాకు పెరగడమే తప్పించి, వేరే ఉపసనమ కూడా లేదు. ఆర్ టి సి కి ఏం డి గా వేసారు ఇప్పుడు ఆయనను. అక్కడ ఏమి చేస్తారు అని చూడాలి ఇప్పుడు.

3. హక్కుల సంఘం నేత కే. బాలగోపాల్ ఈ వారం చనిపోయారు. అయన గురుంచి ముందు ఎప్పుడు వినలేదు, కాని అయన చనిపోయిన రోజు అన్ని పత్రికలు మొదటి పేజి లో బ్యానర్ కథలు ప్రచురించాయి. అన్ని పత్రికలు. అయన గురుంచి చదువుతుంటే ముందే తెలుసు ఉంటె బాగుండేది అనిపించింది. అయన రాసిన కొన్ని వ్యాసాలు చదివాను, నిజంగానే చాలా తెలివైన వ్యక్తీ. అద్భుతం గా రాసారు. గణిత శాస్త్రం లో డాక్టరేట్ ఉన్న సరే, అదీ వదిలేసి, మనవ హక్కుల్ని పరిరక్షచిందానికి ప్రజా జీవితం లోకి వచ్చారు. పోలీసు జులుం ని, నక్సలైట్ల అర్చకాన్ని ఒకే విధంగా వ్యతిరేకించారు. లాయర్ గా కూడా గత పది ఏళ్ళు గా, పలు ఎన్కౌంటర్ కేసుల్ని వాదించారు. నిజంగానే రాష్ట్రం ఒక మంచి నాయకుడ్ని కాలిపోయింది.

4. సోనియా గాంధి గారు వచ్చారు, చూసారు, వెళ్ళారు. రాజకేయాలు గురుంచి కూడా చర్చించి వెళ్లిపోయారు అంట. మనకి ఏమి తెలిదు అనుకోండి. కాని ప్రధాన మంత్రి గారు మాత్రం వచ్చారు, ఉన్నారు, సమీక్షించారు, మనతో మాట్లాడారు, అప్పుడు వెళ్ళారు. కనీసం ఎవరో ఒకళ్ళు స్పందించారు.

2 comments:

Arun said...

Not that I attribute any credibility to this guy, but how much of this "man made disaster" is true?

TRS chief, K. Chandrashekhar Rao alleged that the floods in Andhra Pradesh were caused because of the "illegal" irrigation projects launched by the Congress regime under late YSR Reddy.

http://indiatoday.intoday.in/site/Story/65330/LATEST%20NEWS/Telangana+party+blames+YSR%27s+pet+projects+for+flood.html

Sudhir said...

The man made disaster part is very much true. Infact, today morning I confirmed this again while watching a TV news discussion.

Basically, they needed to release water from Srisailam dam when the water level reached 854 feet, which they didn't. All along the officials have been maintaining that they did not anticipate this big inflow.

This inflow came from Alamatii and Jurala projects, and it will take atleast 2 days for them to reach here. Now, there is obviously some lapse somewhere about this information being passed on.

In the TV discussion today, the Chief Engineer of Irrigation dept. called in, and rubbished all claims of man made disaster with this argument - the inflows were because of the rains and not because of release of water! The panelists were surprised, and asked him how can some 20 lakh cusecs of water come from such less rain. The Engineer answers - it came, what am I supposed to do?!

So now the strategy is - offense is the best defense. The worst legacy YSR left.

As to why people did not take KCR seriously was because of his language - highly frustrating.
- Sudhir

Post a Comment