Sunday, August 23, 2009

అదన్నమాట! : ఆగస్ట్ 16-22

1. మల్లి ఈ వారం కూడా అసెంబ్లీ గురుంచే రాయాల్సి వస్తుందేమో అనుకుంటున్నా తరుణం లో ఈనాడు ఒక రాజకీయ మలుపు ఇచ్చింది. గురువారం సంచిక లో "జెండా పీకేద్దామా " అంటూ పతాక శీర్షిక రాసింది ! ప్రజా రాజ్యం పార్టి ఎమ్యెల్యేలు కొంత మంది అల్లు అరవింద్ ని కలిసి కాంగ్రెస్ లోకి పార్టి ని విలనీయం చేస్తే మంచిది అని చెప్పినట్టు, దానికి అల్లు ఒక నెల గడువు ఇవ్వండి అన్నట్టు ఆ వార్త లో ఉంది. ఒక్క సారి గా ఇక అందరి ద్రుష్టి చిరంజీవి గారి మీదకి మళ్ళింది. గత సంవత్సర కాలం లో ఏనాడు లేని విధంగా మొట్ట మొదటి సారి అయిన మనసులోంచి మాట్లాడారు ! పత్రికల్ని ఉతికి ఆరేసారు. రాజకీయ భవిష్యతు, ముందు ముందు చెయ్యాల్సిన కార్యక్రమాలు గురుంచి చర్చించడానికి కలిస్తే, ఇంత దారుణంగా రాస్తారా అని వాపోయారు కూడా. అయిన ఆవేదన చూసి కృంగి ఉన్న శ్రేన్నులో కూడా ఒక్క సారి గా ఉపు వచ్చింది అంట!

2. నాది ఒక ప్రశ్న. కాదు లెండి, చాల ప్రశ్నలు. అసెంబ్లీ జరుగుతున్న సమయం లో, రాష్ట్రం లో కరువు ఉన్న సమయం లో, దరిదాపు లో ఎన్నికలు లేని సమయం లో, మీ పార్టి లో మూడో వంతు ఏమ్యేల్యేలకు "రాజకీయ భవిష్యతు" గురుంచి మాట్లాడే దుస్థితి ఏమి వచ్చింది చిరంజీవి గారు? అదీ అర్ధరాత్రి? మీరు ఎం చేదం అనుకుంటున్నారో మీకే తెలియనప్పుడు ఇలాంటి ఉహాగానాలె పుడతాయి మరి. ఈనాడు హెడ్లైన్ చాల తప్పు, నేను ఒప్పుకుంట. దాని వెనక వ్యూహం ఉండే ఉంటె, అది చాల దారుణంగా బెడిసి కొట్టింది అని కూడా అందరం చూసాం. కాని, అటువంటి పరిస్థితులకు మీరు మీ పార్టి నీ తీసుకు వచ్చారు అన్నది మాత్రం పచ్చి నిజం.

3. రాష్ట్రం లో 56% తక్కువ వర్ష పాతం నమోదు అయ్యింది. అయిన మన ముఖ్య మంత్రి గారు కరువు ప్రకటించారు అంట. పై పెచు, కరువు ఉంది కరువు ఉంది అని మనం అందరం అరుస్తునందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు అంట! కరువు ప్రకటిస్తే బ్యాంక్లు రుణాలు ఇవ్వవు అంట, అందుకని ప్రకటన ఇవ్వట్లేదు అంట! ముఖ్యమత్రి గారు, వర్షాలు పడకపోతే రైతు అసలు ఋణం ఏమి చెప్పి తీసుకుంటాడు అండి? మీరు ప్రకటించే కరువు ఖరిఫ్ సాగు కి. అదీ ప్రకటిస్తే, బ్యాంక్లు రబీ సాగు కి ముందే రుణాలు ఇస్తాయి. ఖరిఫ్ పంట ఎలాగో ఇంకో వారం లో అయ్యిపోతుంది. కనీసం మీరు కరువు ప్రకటిస్తే, కేంద్రం నుంచి అయిన సహాయం అంద్తుంది కదా ? కరువు ప్రకటిస్తే ఎంతో కంత మంచే జరుగుతుంది కాని చెడు ఎందుకు జరుగుతుంది ?

4. ఎ మాట కి ఆ మాట చెప్పుకోవాలి, చిరంజీవి గారు కరువు మీద జరిగిన చర్చ ని చాల అద్భుతంగా అభివర్ణించారు. "కరువు ముగుస్తుంది ఏమో కానీ, చర్చ ముగిసే లాగా లేదు" అని చెప్పారు! అక్షర సత్యం. మంత్రులు అందరిది ఒకటే బాట - చంద్రబాబు నాయుడు ని తూర్పారబట్టడం. ఎటువంటి సమస్య అన్యిన సరే, తిప్పి తిప్పి నాయుడు గారి దగ్గరకి తెస్తారు. గొడవ అవుతుంది. సభ వాయదా పడుతుంది. అదన్నమాట!

3 comments:

Arun said...

More often, the law abiding, hardworking people of AP, Karnataka and Maharashtra find themselves neglected on Railway projects. Bihar, WB and TN (not to question the work ethics of the last mentioned state) never get overlooked.

State being left out in Railway projects: YSR

“our biggest grouse is the way the Railways neglected South India in general and Andhra Pradesh and Karnataka in particular”

http://www.hindu.com/2009/08/22/stories/2009082253800400.htm

Sudhir said...

Thanks Arun for the comment. You are absolutely right, AP and K'taka are simply ignored even if same parties rule at both centre and state. I actually wanted to mention a point in the blog, but it somehow skipped my mind. The report you gave the link to reveals a more damaging capitulation.

We are not just seeking projects anymore, but are even willing to take up upto 50% of the costs!! I mean, this really shows how much the central government has pushed us to the limit. For a state government to agree to share the costs of a central government project that other states get for free looks like the heights of desperation, but that's where we have been pushed to.

- Sudhir

Unknown said...


for more information about packers and movers of gurgaon click on the one of the following link:
packers and movers in gurgaon
movers and packers in gurgaon
packers and movers gurgaon
movers and packers gurgaon
http://www.top8list.in/packers-movers-gurgaon/

Post a Comment